calender_icon.png 6 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి విరాళాలు

06-02-2026 02:09:03 PM

మఠంపల్లి ఫిబ్రవరి 06(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన ప్రధాన రహదారి వద్ద దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం కమిటి సభ్యులు మఠంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్,మాజీ ఎంపీపీ మూడవతు పార్వతి కొండా నాయక్ ను విన్నవించగా ఇద్దరు చేరో రూ.లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,రామచంద్రపురం మాజీ సర్పంచ్ మాలోతు బుజ్జి భీముడు నాయక్ రూ.యాభై వేలు చెక్కులను కమిటి సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన నాయకులకు కమిటి సభ్యులు,అయ్యప్ప భక్తులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.