06-02-2026 02:07:46 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహిళల చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చెరుకుపల్లి శైలజతో పాటు సుమారు 12 మంది మహిళలు తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, మహిళా సాధికారత లక్ష్యాలను ఆకర్షితులై జాగృతిలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పల్లె నిషా పాల్గొని, నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మహిళల భాగస్వామ్యంతో తెలంగాణ జాగృతి మరింత బలపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.