11 March, 2026 | 11:50 PM

ఆదర్శ పాఠశాలగా మార్చేందుకు విరాళం

11-03-2026 08:23 PM

దోమకొండ,(విజయక్రాంతి): తాను చదువుకున్న దోమకొండ బాలుర పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ వ్యాపారి పబ్బ విజయ్ కుమార్ ముందుకు వచ్చారు. తన తల్లిదండ్రులు పబ్బ రుక్కమ్మ–బలరామయ్య జ్ఞాపకార్థం కోటి రూపాయలతో పాఠశాల అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నుంచి అనుమతి ఉత్తర్వులు రావడంతో ప్రధానోపాధ్యాయురాలు రాధాలక్ష్మి ఆయనకు ప్రతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జడ్పీటీసీ తిరుమల్ గౌడ్ తదితరులు దాతను అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.