1 నుంచి వీబీజీ రామ్‌జీ
ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ.3,825 కోట్లు
రాష్ట్రంలో పథకం అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఎంజీఎన్‌ఆర్జీఈఎస్ (మహా త్మాగాంధీ ఉపాధి హామీ) పథకం కింద గతంలో అందిస్తున్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచి గ్రామీ ణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం వీబీజీ రామ్‌జీ పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
1 జూలై, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న ఈ పథకం కింద 2026--27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారన్నారు. వికసిత్ భారత్ దృష్టిలో భాగంగా పీఎం మోదీ ఈ పథకాన్ని తెచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని సకాలంలో అమలు చేయడంపై గురువారం న్యూఢిల్లీలో ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి కిషన్‌రెడ్డి చర్చించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...ఈ పథకం కింద శ్రామికుల కుటుంబాలకు కొత్తగా గ్రామీణ రోజ్ గార్ గ్యారంటీ కార్డులు జారీ చేయడంతోపాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉందని, అలాగే, తన వాటా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ పథకానికి సంబంధించి తనవంతు బాధ్యతలను సకాలంలో పూర్తిచేశానని, 1 జూలై, 2026 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమలుకు సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి కోరారు. చర్చలో భాగంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులూ దొరకని సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సంవత్సరం వారికి తప్పనిసరిగా 125 రోజుల ఉపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.
గత 12 ఏళ్లుగా 143.23 కోట్ల పనిదినాలను కల్పించామని, ఇందుకు మొత్తం రూ.34,639.17 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 09.06.2026 నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్ సింగ్ తెలిపారు.






