లక్ష్యం.. వికసిత్ భారత్
- అందుకు చక్కటి వేదిక నీతిఆయోగ్
- దేశాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండాలి
- విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి
- యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలి
- ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
- ౧౧వ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు
- హాజరైన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ, జూన్ ౧౧: వికసిత్ భారత్ ప్రతిఒక్కరి లక్ష్యం కావాలని, ౨౦౪౭ నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని మంత్రి, నీతి ఆయోగ్ చైర్మన్ మోదీ పిలుపునిచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నీతి ఆయోగ్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని నొక్కిచెప్పారు. వికసిత్ భారత్ కేవలం ప్రభుత్వాల ఆకాంక్ష మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కల అని అభివర్ణించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం నిర్వహించిన ౧౧వ నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వికసిత్ భారత్‌తో పాటు మరో మూడు అంశాలపై ప్రధాని మాట్లాడారు. దేశాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం ఉండాలని, కలిసికట్టు గా పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం కూడా అవసరమని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తున్నాయని, భారత్‌తో వ్యాపార సంబంధాలు నెరపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రా ల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చా రు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వ్యాపార అభివృద్ధికి బాటలు వేయాలని, అందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే సులభతర వాణిజ్య విధానాలను అమలు చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని, తద్వారా భారతదే శాన్ని ప్రపంచానికి ‘నైపుణ్యాల రాజధాని’గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నప్పటికీ, భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నదని కొనియాడారు.
వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్) ఎగుమతులకు, ప్రగతి కొత్త మార్గాలను తెరుస్తున్నా యని వివరించారు. ఒప్పందాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు) అంతర్జాతీయ ప్రమాణాలను అంది పుచ్చుకుంటున్నాయని తెలిపారు. భారతదేశం అపారమైన యువశక్తిని కలిగి ఉన్నదని, ఇదొక చారిత్రక అవకాశమని అభివర్ణించారు. నాణ్యమైన విద్య, మార్కెట్ అవసరాలకు అనుగుణ మైన యువతకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలని సూచించారు.
తద్వారా ఉపాధి అవకాశాల కల్పన సులభతరం అవుతుందని వెల్లడించారు. సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ నిర్మాణంలో చోదక శక్తిగా మారుతుందన్నారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని, మహిళల నేతృత్వంలోని అభివృద్ధే వికసిత్ భారత్ సంకల్పానికి ముఖ్యమైందన్నారు. వ్యవసాయం, స్టార్టప్‌ల నుంచి సైన్స్, ఇన్నోవేషన్ వరకు అన్ని రంగాల్లో నారీశక్తి అద్భుతంగా రాణిస్తోందన్నారు. సమావేశంలో నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ అశోక్‌కుమా ర్ లాహిరి, పలువురు సభ్యులు, కేంద్రమం త్రులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకేఎస్, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.






