12 June, 2026 | 3:08 AM

5 వేల కోట్ల మోసం భగ్నం

12-06-2026 02:01 AM
  1. ‘ఇగ్నైట్’ మోసానికి పోలీసుల చెక్
  2. ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్ ద్వారా భగ్నం.. నలుగురు అరెస్ట్
  3. సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడి 
  4. మామిడిపళ్ల కేసులో నిజాన్ని నిగ్గు తేలుస్తామని వెల్లడి

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో రూ. 5వేల కోట్ల మోసానికి తెరలేపిన ‘ఇగ్నైట్’ మనీ సర్క్యూలేషన్ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం నగర పోలీసు కమిషనర్‌సజ్జనార్ మీడియాకు వివరించారు. గతం లో క్యూనెట్ పేరుతో ఉన్న సంస్థే ఇప్పుడు పేరు మార్చుకొని ‘ఇగ్నైట్’ సంస్థ పేరుతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిందన్నారు.

ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు సూత్రధారాలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ నెట్‌వర్క్‌ను భగ్నం చేసేందుకు ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ పేరుతో రంగంలోకి దిగామన్నారు. కేరళం, పశ్చిమ బంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నా మని సీపీ వివరించారు. ఈ ముఠా తమ మోసపూరిత కార్యకలాపాలను ప్రారంభించిన 18రోజుల్లోనే పోలీసులు పసిగట్టారని చెప్పా రు.

వీరిని అరెస్టు చేయడం వల్ల వేలాదిమంది అమాయక ప్రజలను ఆర్థికంగా మోసపోకుం డా రక్షించగలిగామన్నారు. క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్ నిర్వాహకులే ఈ ‘ఇగ్నైట్’ వెనుక కూడా ఉన్నట్లు తెలిపారు. గత 30 ఏళ్లు గా సీసీఎస్ దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ ముఠా మొదట గోల్ క్వెస్ట్, క్వెస్ట్‌నెట్, క్యూనెట్, ఇగ్నైట్ ఇలా ప్రతీసారి సరికొత్త పేర్లతో మోసాలకు తెరలేపుతున్నట్లు గుర్తించామని చెప్పారు.

ఈ మాయాజాలంపై ముగ్గురు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యా దు చేయడంతో వీరి బండారాన్ని బట్టబయ లు చేశామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ రకమైన ఆన్‌లైన్ మార్కెటింగ్, మనీ సర్క్యూలేష న్ తదితర పేర్లతో మోసాలకు తెరలేపుతున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు.

ఇటీవల నారాయణగూడ మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటనపై మాట్లాడుతూ..దీనిపై విచారణ కొనసాగుతుందని, నమూనాలు భద్రప ర్చాలని ఆదేశించామని, వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని, మరణాలకు కారణాలను తెలుసుకుంటామని తెలిపారు.