19వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ లో 15లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్ నిర్మాణం పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్లు ప్రారంభించారు.
19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ కాలనీలోని ప్రధాన సమస్య అయినా మంచి నీటి గురించి అడగగా సంబధిత వాటర్ సప్లై డిఈ వెంకటేశ్వర్లును వెంటనే మంచి నీరు అందించాలని సూచించారు. డివిజన్ కు మరిన్ని నిధులు సమాకూర్చి మీ పాలనలో మరింత అభివృద్ధి పరుచాలని కార్పోరేటర్ కోరారు.ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పోరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




