రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలి
....జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): రక్త దానం చేసి ప్రాణదాతలు నిలవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దానాల్లో కెల్లా రక్త దానం చాల గొప్పది అన్నారు.
ఎందరినో ప్రాణాలు నిలబెట్టిన వారౌతామన్నారు. ఉద్యోగులు అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎత్తు, బరువు, బిపి,జి ఆర్ బి ఎస్, ఇ సి జి, కంటి వైద్య, పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాఅభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సీతారాం, జిల్లా పంచాయతి అధికారి భిక్షపతి గౌడ్, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.




