రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ
తంగళ్లపల్లి మండలంలో రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై గడ్డి కట్టలు కట్టే స్టాబలర్ యంత్రాలను పంపిణీ చేశారు. వ్యవసాయ పనులను సులభతరం చేయడంతో పాటు రైతుల ఖర్చులు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పరికరాలను అందజేస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తొంటి కవిత, మ్యాదరవేణి కన్నయ్య, అంకుశాపూర్ గ్రామానికి చెందిన పాలిటి అనిల్, చీర్లవంచ గ్రామానికి చెందిన నాయిని కమలాకర్ రావుకు స్టాబలర్ యంత్రాలు అందించారు. లబ్ధిదారులు ఈ పథకం ద్వారా సబ్సిడీపై పరికరాలు అందించిన ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నరసింగం గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కలేపల్లి తిరుపతిరెడ్డి, ఆరెపల్లి బాలు, పొన్నాల పరశురాములు, మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ గౌడ్, నాయకులు మునిగేలా రాజు, మిరాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




