calender_icon.png 24 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాన్ ఎల్‌మెంచో ఖతం

24-02-2026 12:11:24 AM

  1. మెక్సికో సైనిక ఆపరేషన్‌లో మృతి
  2. మద్దతుదారుల నిరసన.. అట్టుడుకుతున్న నగరాలు

మెక్సికో, ఫిబ్రవరి ౨౩: మెక్సికో ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారైన శక్తిమంతమైన డ్రగ్స్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగ్యురా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచోను ఎట్టకేలకు ఆ దేశ సైన్యం మట్టుపెట్టింది. జాలిస్ స్కో రాష్ట్రంలోని తాపల్పలో తాజాగా సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఎల్‌మంచోను కాల్చిచంపింది. ఎల్ మెంచో మరణవార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగాయి.

ఎల్ మంచోకు మద్దతుదారులైన జాలిస్ స్కో న్యూ జనరేషన్ కార్టెల్ సభ్యులు 20 రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వందలాది వాహనాలకు నిప్పు పెట్టారు. పలు రహదారులను దిగ్బంధించారు. పలు నగరాల్లోని బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఫార్మసీలను లూటీ చేశారు. తుపాకులతో వీధుల్లోకి వచ్చి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. పశ్చిమ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండటంతో మెక్సికో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని 2,500 మంది సైనికులను మోహరింపజేసింది.

రైతు కుటుంబం నుంచి వచ్చి మాఫియా డాన్‌గా..

ఎల్‌మంచో మెక్సికోలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. సగ టు మధ్యతరగతి నుంచి వచ్చి పట్టుదలతో చదువుకున్నాడు. పోలీస్ అధికారిగా కొన్నా ళ్లు పనిచేశాడు. తర్వాత డబ్బుపై ఉన్న వ్యా మోహం అతడిని మాఫియా వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే ఎల్ మంచో ‘జాలిస్ స్కో న్యూ జనరేషన్ కార్టెల్’ రెబల్ ముఠాను స్థాపించాడు. ముఠా స్థాపించిన పదేళ్లలోనే, దాని కార్యకలాపాలు సగం దేశానికి పాకా యి.

ప్రభుత్వానికి సమాంతర శక్తిగా ఎదిగిం ది. ఎల్ మంచో స్వయంగా ప్రైవేటు సైన్యా న్ని నడపడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తాను అంతర్జాతీయ స్థాయిలో సింథ టిక్ డ్రగ్స్,ఫెంటానిల్ డ్రగ్స్ రవాణా డాన్‌గా ఎదిగాడు. కేవలం డ్రగ్స్ దందానే కాకుండా, ఎల్ మంచో తన ముఠాతో కిడ్నాప్‌లు, చమురు చోరీలు, హత్యలు చేయించి కూడా సొమ్ము చేసుకునేవాడు.

అమెరికా ప్రభు త్వం ఇతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించిందంటే, అతడు ఎంత పెద్ద నేరస్థుడో అర్థం చేసుకోవచ్చు. అంతటి కరుడుగట్టిన నేరస్థుడిని మెక్సికన్ సైన్యం ఎట్టకేలకు హతమార్చగలిగింది. అయితే.. దీని వెనుక తామే ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఎల్ మంచోను మట్టుపెట్టేందుకు, మెక్సికన్ సైన్యానికి అమెరికా నిఘా వర్గాలే అతని సమాచారాన్ని అందించాయని చెప్పుకొచ్చారు.