4 July, 2026 | 9:13 PM

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు ‘దొడ్డి కొమురయ్య’: కలెక్టర్ కుమార్ దీపక్

04-07-2026 07:44 PM

నస్పూర్,(విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉత్సవాలకు వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, వెనుకబడిన తరగతుల కులాల సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చైతన్యపరిచి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం యువతకు మార్గదర్శకమన్నారు. దేశ స్వాతంత్రం, ప్రజల సంక్షేమం కోసం విరోచితంగా పోరాడి, ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.