28 June, 2026 | 2:16 AM

వినికిడి, మాటల సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు

28-06-2026 01:10 AM

డాక్టర్ పగిడాల మనీష, ఆడియోలజిస్ట్, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజిస్ట్

మహబూబ్‌నగర్, జూన్ 27(విజయక్రాంతి): వినికిడి లోపం, మాటల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమవుతుందని జడ్చర్ల శాన్వి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆడియాలజిస్ట్ డాక్టర్ పగడాల మనీషా సూచించారు. స్థానిక శాన్వి క్లినిక్‌లో శనివారం నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నపిల్లల్లో మాటలు ఆలస్యంగా రావడం, పిలిస్తే స్పందించకపోవడం, పెద్దల్లో టీవీ వాల్యూమ్ పెంచడం, మాటలు పదేపదే అడగడం వంటివి వినికిడి లోపానికి సంకేతాలని తెలిపారు.

పిల్లల్లో రెండు సంవత్సరాలు దాటినా మాటలు రాకపోవడం, పిలిస్తే పలకకపోవడం, మాటలు తడబడటం, పెద్దల్లో చెవులో హోరు, మాటలు సరిగా వినపడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వినికిడి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. వినికిడి లోపం వల్ల పిల్లల్లో మాటలు, భాషా నైపుణ్యాలు దెబ్బతింటాయని, చదువుపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఆధునిక స్పీచ్ థెరపీ, డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ ద్వారా 90శాతం సమస్యలను నయం చేయవచ్చని వివరించారు. మూడేళ్ల పైబడిన పిల్లలు, 50 ఏళ్లు దాటిన వృద్ధులు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ప్రారంభ దశలో గుర్తిస్తే స్పీచ్ థెరపీ, హియరింగ్ ఎయిడ్స్ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు. సమస్య ఉన్నవారు వెంటనే నిపుణులను సంప్రదించాలని కోరారు.