29 June, 2026 | 2:46 AM

తప్పుడు ప్రచారం నమ్మవద్దు

29-06-2026 12:00 AM

అంజనీపుత్ర చైర్మన్ శ్రీధర్

మంచిర్యాల టౌన్, జూన్ 28: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ మీద కొందరు, కొన్ని సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ పేర్కొన్నారు. ఆది వారం విలేకరుల సమావేశంలో ఎండీ పిల్లి రవితో కలిసి మాట్లాడారు.

సోషల్ మీడియాలో కావల్సుకొని తప్పుడు వార్తలు, వీడియోలు షేర్ చేస్తూ మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొంటామని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కస్టమర్లు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.