9 April, 2026 | 4:02 AM

అంగన్వాడీ సమస్యల పరిష్కారిస్తా

09-04-2026 12:00 AM

టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

సనత్‌నగర్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి):- అంగన్‌వాడి కేంద్రాలలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అమీర్‌పేట, సనత్‌నగర్ డివిజన్‌ల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు నూతన మొబైల్ ఫోన్‌లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.

అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, పిల్లల వివ రాలు, వారికి అందిస్తున్న పౌష్టికాహారం తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేం దుకు మొబైల్ ఫోన్ లను అంగన్వాడీ టీచర్లకు అందిస్తున్నట్లు సూపర్‌వైజర్‌లు లోవ కుమారి, పాతిమాబేగం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వివరించారు. మెరుగైన సేవలు అందించాలని అంగన్‌వాడీల ను ఆదేశించారు. అంగన్‌వాడీకేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి వివరాలు అందజేస్తే పరిష్కారానికి కృషి చేస్తాన ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేష కుమారి, నాయకులు అశోక్‌యాదవ్, ప్రవీణ్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహాన్, కట్టా బలరాం, లలితాచౌహన్ తదితరులు పాల్గొన్నారు.