3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ

03-07-2026 08:19 PM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి,ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే పోచారం నివాసం వద్ద శుక్రవారం బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్థులు 122 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపట్టాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని వారి పేరు మీద ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగిందన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో  సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశామని మిగిలిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. పిల్ల పట్టాలను అందజేసినందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, బీర్కూర్ తహసీల్దార్ సవాయి సింగ్, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.