3 July, 2026 | 9:49 PM

Breaking News

చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •  

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

03-07-2026 08:55 PM

డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ అన్నారు. శుక్రవారం బోడుప్పల్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ... ప్రతి ఓటరును సంబంధిత ఓటర్ల జాబితాలో పూర్తిగా కవర్ చేయడంతో పాటు, వారికి ఓటరు ధృవీకరణ ఫారాలను అందజేసి, నింపిన ఫారాలను తప్పనిసరిగా తిరిగి సేకరించాలని ఆదేశించారు.

ఫారాలు సమర్పించని పక్షంలో సంబంధిత ఓటరు పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతిబింబించకపోయే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించి ఎవరైనా ఓటరు ఫారం అందుకోకపోయినా లేదా ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా, బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ హెల్ప్ డెస్క్‌కు సంబంధించి శ్రీ పి. రాజేష్, వార్డు ఆఫీసర్‌ ఫోన్ నెంబర్  9059688915 ను సంప్రదించవచ్చని తెలిపారు.