వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్
03-07-2026 09:15 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మద్ది దాకవ్వ ఇంట్లో వర్షపు నీరు కారుతూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి వెంటనే స్పందించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గించేందుకు ఇంటి పైకప్పుపై కప్పేందుకు టార్పాలిన్ కవర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉంటామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మౌనిక, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చింతనతో సిద్ధరాములు, నాయకులు మామిడి చందు, తుడుం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.






