3 July, 2026 | 10:20 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

03-07-2026 09:26 PM

13 మంది లబ్ధిదారులకు రూ.13.01 లక్షల సాయం

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు మానుక సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13,01,116 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.