బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓగా బాధ్యతలు చేపట్టి బదిలీపై మద్నూర్ ఇన్చార్జ్ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ రెడ్డికి శుక్రవారం డిఎల్పివో ప్రసాద్ రావు, ఎంపీవో నాగరాజు, ఎంపీడీవో ఆనంద్, ఏపీవో సౌజన్య, బాన్సువాడ మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
బాన్సువాడ మండల ఎంపీవోగా ఐదు సంవత్సరాల ఐదు నెలల మూడు రోజులు విధులు నిర్వహించి అందరి మన్నలను పొందిన అధికారిగా పేరు పొందడం జరిగింది. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సమస్యల పరిష్కారం విధుల పట్ల నిబద్ధత కలిగిన అధికారి అని సర్పంచ్ లు కార్యదర్శులు పేర్కొన్నారు. అయినతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.అదేవిధంగా బదిలీపై వెళ్లిన గ్రామపంచాయతీ కార్యదర్శులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






