9 July, 2026 | 4:48 AM

విద్యార్థులకు కంపాస్ బాక్సులు పంపిణీ

09-07-2026 01:50 AM

మధిర, జూలై 8 (విజయ క్రాంతి): మధిర పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 190 మంది పదోవ తరగతి విద్యార్థులకు కంపాస్ బాక్సులు పంపిణీ చేసిన ప్రవాస భారతీయుడు పుల్లఖండం శ్రీరామ్. ఈ సందర్భంగా పుల్లఖండం చంద్ర శేఖర్ మాట్లాడుతూ.... కంపాస్ బాక్సులు భౌగోళిక శాస్త్రం లేదా గణితం వంటి విషయాల్లో ఆసక్తిని పెంచడానికి, అలాగే అవసరమైన సాధనాలను అందించడానికి ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, పుల్లఖండం చంద్రశేఖర్, శ్రీయాన్, శ్రేయస్, రిటైర్డ్ ఎమ్.డి.ఓ. మాధవరపు నాగేశ్వరరావు, పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని, దాతకు కృతజ్ఞతలు తెలిపారు.