18 August, 2026 | 2:21 AM

సర్పంచ్, కార్యదర్శుల వివాదం..

18-08-2026 01:23 AM

విచారణ చేసిన డీఎల్పీవో 

తాండూరు, ఆగస్టు 17, (విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ సర్పంచ్, కార్యదర్శి మధ్య జరిగిన వివాదంపై సోమవారం జిల్లా పం చాయతీరాజ్ శాఖ అధికారి జయసుధ విచారణ చేశారు.  సర్పంచ్ ఆనంద్ నాయక్, కా ర్యదర్శి వినీత, జయరామ్ తండా ఇందూరు కార్యదర్శి మల్లేష్ లను వేరువేరుగా ఎంపీడీవో తిరుమల స్వామి, ఎంపీవో రతన్ సింగ్ సమక్షంలో విచారణ జరిపారు. ఈ మేరకు  విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని ఆమె తెలిపారు.