18 August, 2026 | 4:08 AM

గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి

18-08-2026 02:18 AM

ములకలపల్లిలో పర్యటించిన ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదిరాయణ

ములకలపల్లి, ఆగస్టు 17 (విజయక్రాం తి): గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి,అశ్వారావుపేట ఎ మ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ములకలపల్లి మండలంలోని ముత్యాలంపాడు, పాలవాగు గ్రామాల్లో  ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సోమవారం సిసి రోడ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన ములకలపల్లి మండలం లోని మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడకూడదని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జహీరుద్దీన్,  ప్రజాప్రతినిధులు,పలు శాఖల అధికారులు,ములకలపల్లి మండల,స్థానిక కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.