18 August, 2026 | 3:15 AM

పువ్వాడ.. తప్పుడు మాటలు మానుకో

18-08-2026 02:19 AM

మాజీ మంత్రి వాఖ్యలను ఖండించిన జిల్లా కాంగ్రెస్ నేతలు

ఖమ్మం, ఆగస్టు 17(విజయక్రాంతి): మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, తప్పుడు మాటలు మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో ఆయన అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి పు వ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధ మా అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశా రు.

ఆయన మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర రావు అని నాలుగు దశాబ్దాల అనుభవం ఉ న్న మచ్చలేని నాయకుడని,తుమ్మల నాగేశ్వరరావు పై అసత్య ప్రచారం ఆకాశంలో ఉ మ్మి వేసిన చందంగా ఉందని ఎద్దేవా చేశా రు. అదే విధంగా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి గోదా వరి జలాలు తీసుకొచ్చారని,వ్యవసాయ మా ర్కెట్ ఆధునీకరణ,కేబుల్ బ్రిడ్జి నిర్మాణం,ఇంటిగ్రేటెడ్ స్కూలు చెప్పుకొంటూ పోతే కోకొల్లలని అన్నారు

ఇప్పటికైనా అవాకులు చెవాకులు మాని అభివృద్ధికి సహకరించాలని అన్నారు.అదే విధంగా ప్రజాపాలన గావిస్తున్న ప్రజా ప్రభుత్వ రథ సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సహచర మంత్రి వర్గ సహచరులతో కలిసి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజ న్య, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ము జాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.