18 August, 2026 | 3:16 AM

మండలస్థాయి ప్రజావాణి విజయవంతం

18-08-2026 02:20 AM

17 దరఖాస్తుల స్వీకరణ

గుండాల, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుండి ప్రారంభమైన మండలస్థాయి ప్రజావాణీ కార్యక్రమంలో మండల ప్రజల నుండి మొత్తం 17 దరఖాస్తులను పలు శాఖల అధికారులు స్వీకరించారని ఎంపీడీవో బాలరాజు తెలిపారు. ప్రజావాణీలో వచ్చిన దరఖాస్తులలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు, గ్రామాల్లోని అంతర్గత రహదారులకు సీసీ రోడ్ల నిర్మాణం, ముత్తాపురం గ్రామపంచాయతీలో అంగన్వాడీ భవన నిర్మాణం, 24 గంటల విద్యుత్తు సరఫరా, పట్టాదారు పాసు పుస్తకాల మంజూరీ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు మరియు సిబ్బంది నియామకం,

రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న కొనుగోలుకై చెల్లింపులు పూర్తిగా రాలేదని ఇంకా బకాయి ఉన్నదని వాటి చెల్లింపులు మొత్తం 17 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. మొదటి రోజు ప్రజావాణీ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన 18 మంది అధికారులు బాలరాజు, సంగీత, సునీల్ కుమార్, లక్ష్మీ నర్సు, రవి కుమార్, పార్వతమ్మ, సురేష్, కృష్ణం రాజు, రాకేష్, జగదీశ్, కమలాకర్, వినీత్, త్రిలోక్, రవితేజా, ప్రేమ్ కుమార్, రాజేష్, మంగవేణి, పృథ్వీ తేజా పాల్గొన్నారు.