22 April, 2026 | 2:31 PM

Breaking News

షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •  

పెన్షనర్ల ఆశాజ్యోతి ధరమ్ స్వరూప్ నకారా

18-12-2025 12:34 AM

భద్రాచలం, డిసెంబర్ 17, (విజయక్రాంతి): వృద్ధాప్యంలో ఏ విధమైన ఆదాయం లేకుండా కష్టాలు పడి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రూపంలో భద్రత కల్పించిన ఆరాధ్యుడు డిఎస్ నకారా అని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో డివిజన్ కమిటీ పింఛన్దారుల సమావేశంలో ఘనంగా నివాళులు అర్పించారు. 

సంఘం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పింఛన్దారుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించి పింఛన్దారులకు పెన్షన్ అమలు చేయించిన ఘనత నకారాదేనని అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి సహాయ కోశాధికారి నాళం సత్యనారాయణ గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు సహాయ కోశాధికారి నాళం  సత్యనారాయణ సాహద్యక్షులు  శివప్రసాద్ జి మురళీకృష్ణ కార్యదర్శి ఐవి వి సత్యనారాయణ నాయకులు సూరిశెట్టి కృష్ణ బన్సీలాల్ టీ దాసు కన్నయ్య లాల్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పిస్తూ  చిత్రపటానికి పూలు చల్లారు.