3 August, 2026 | 2:34 AM

కరీంనగర్ అభివృద్ధిపైనే నా దృష్టి

03-08-2026 01:24 AM
  1. కేంద్రం నుండి మరిన్ని నిధులు రాబట్టేందుకు యత్నిస్తున్నా
  2. తెలంగాణ సంస్క్రుతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
  3. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
  4. మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి కరీంనగర్ 24వ డివిజన్ లో అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన

ముకరంపుర, ఆగస్ట్2(విజయక్రాంతి): అభివృద్ధిలో కరీంనగర్ కార్పొరేషన్ ను రా ష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న దానిపై నే ద్రుష్టిని కేంద్రీకరించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ తెలిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకువ చ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ లోని 24వ డివిజన్ లోని బ్యాంక్ కాలనీలో రూ.50 లక్షల విలువైన యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సు నీల్ రావు, స్థానిక కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.

అక్కడి నుండి కిసాన్ నగర్ వెళ్లిన బండి సం జయ్ పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. మున్నూరుకాపు సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బోనాలంటేనే భక్తి, వీరత్వానికి ప్రతీక. బోనాలంటే కేవలం ఒక జాతర కాదు. తెలంగాణ సంస్కృతికి జీవం, భక్తి-శక్తి-సంప్రదాయాల క లయిక అన్నారు. లక్షలాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవాలు కరీంనగర్ ను ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతాయన్నారు.

అసలు బోనాలు అంటేనే తెలంగాణ సం స్కృతికి ప్రతీక. అని బోనాలంటేనే తెలంగా ణ ఆత్మగౌరవం. బోనాలంటేనే... జానపద క ళల పండుగ. బోనాలంటేనే... కుటుంబాల క లయిక. బోనాలంటేనే...మహిళా శక్తికి ప్రతీక. బోనాలంటేనే ... ఎంతగా కార్పొరేటీకరణ జరిగినా పట్టణ, గ్రామీణ సంప్రదాయాలను సంరక్షించుకునే మహోత్సవం అన్నారు . బోనాలంటేనే భక్తి, సంస్కృతి, సాహసాల సమ్మేళనంగా పేర్కొన్నారు. పోతురాజు నృ త్యం కేవలం వినోదం కాదని మన ఊరిని, వీధిని కాపాడే వీరత్వానికి చిహ్నమని ఇంత గొప్ప విశిష్టత ఉన్న బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు.