బాసరలో రోడ్ల నిర్మాణానికి 27 కోట్ల నిధులు
కుబీర్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర లో భక్తుల సౌకర్యార్తం ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఆదివారం భైంసా లోని తన నివాసంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
పంచాయత్ రాజ్ ద్వారా ఓని నుండి బాసర వరకు రోడు మరమ్మత్తులకు 2 కోట్ల 55 లక్షలు, గన్నోరా నుండి ఓని వరకు 2 కోట్లు, పి. డబ్ల్యూ. డి. రోడ్ నుండి బాసర లో మహంకాళి టెంపుల్ రోడ్ కు 1 కోటీ 20 లక్షలు, కిర్గుల్ బి నుండి బాసర వరకు రోడ్ కనెక్టివిటికీ 2 కోట్ల 80 లక్షలు, బాసర రైల్వేస్టేషన్ నుండి నావేగావ్ రోడ్ వరకు 1 కోటీ 35 లక్షల నిధులు, మల్కాపూర్ మీదుగా బాసర వరకు 2 కోట్ల 70 లక్షలు ట్రిపుల్ ఐటి నుండి బాలాపూర్ రోడ్ కు 45 లక్షలు, పెట్రోల్ బంక్ నుండి శాంఖరి స్కూల్ వరకు 45 లక్షలు, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో బాసర అబాది నాలుగు లేన్ల రోడ్ పుష్కరా ఘాట్ వరకు 8కోట్ల 50 లక్షలు, బిద్రేల్లి నుండి ధర్మబాద్ కు 2 లైన్స్ రోడ్ కు 4కోట్ల 65 లక్షల రూపాయల నిధులు, బాసర బస్ స్టాండ్ రహదారి మరమ్మత్తుల కు 85 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 2027 లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ పనులను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.






