3 August, 2026 | 2:36 AM

ఉన్నచోటే ఓటు హక్కు ఉంచుకోండి

03-08-2026 12:10 AM

నగర వాసులకు డిప్యూటీ మేయర్ ఎమ్మెస్సార్ సూచన 

మహబూబ్ నగర్ ఆగస్టు 2 (విజయక్రాంతి) : నగరంలో నివాసముంటున్న ప్రజలు గ్రామాలలో నివాసం ఉన్నచోటే ఓటు హక్కు ఉండేలా మక్కువ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నగర డిప్యూటీ మేయర్ ఎమ్మెస్సార్ ఓటర్లకు సూచించారు. మహానగరంగా మహబూబ్ నగర్ ఎదుగుతుందని గ్రామాలలోకి ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

సర్ ప్రక్రియకు మరో నాలుగు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరంలో నివాసం ఉంటున్న వారందరూ ఓటు హక్కు ఇక్కడే ఉంచుకునేలా ఆసక్తి కనబరచాలని పేర్కొన్నారు.

ఇలా చేయడం ద్వారా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని భవిష్యత్తులో గ్రామాల్లో అవసరం ఉంటే వారు గ్రామానికి ఓటు హక్కు మార్చుకునే విసులబాటు ఉంటుందని తెలియజేశారు. వేలాది ఇండ్లు ఉండి ప్రజల సంఖ్యలో ఓట్లు ఉంటే కొందరు నాయకులు అటువైపు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశాలు ఉండవని సూచనప్రాయంగా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.