ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి
15-06-2026 08:56 PM
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాయని సహకార సంఘం డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్ పోశెట్టి పేర్కొన్నారు సోమవారం సోనాల మండల కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకు వస్తున్నారు. శాఖలన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.






