ఎఫ్‌ఎల్‌ఎన్ ఆన్లైన్ పరీక్షలను పరిశీలించిన డీఈఓ
బడంగ్‌పేట్, జూలై 3 (విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం జిల్లెలగూడలోని ఎం.పి.పి.ఎస్. పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ ఆన్లైన్ పరీక్షలను ఆయన పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు శాతం, కంప్యూటర్లు, టాబ్ల సాంకేతిక ఏర్పాట్లు ఉపాధ్యాయుల పర్యవేక్షణ విధానాన్ని డీఈఓ సమీక్షించారు.
పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా, సజావుగా సాగేందుకు వీలుగా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించడానికి ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం ఎంతోదోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎ.కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. హన్మంత్ రెడ్డి, సి.ఆర్.పి, కె.శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






