పాలమూరుకు నేడు సీఎం రేవంత్‌రెడ్డి
- నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊరుకోండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన
- పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
- మిడ్జిల్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ జడ్పీ చైర్మన్ ధ్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ
- బహింరగ సభలో మాట్లాడనున్న సీఎం
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్, జూలై 3 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మ డి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊరుకోండలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాతమహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ పర్యటించనున్నారు. మిడ్జిల్‌లో డాక్టర్ బీఆర్ అం బేద్కర్, మాజీ జడ్పీ చైర్మన్ ధ్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సం బంధిత అధికారులు పూర్తిచేశారు. ఈ ఏర్పాట్లను మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా శుక్రవారం పరిశీలించారు. హె లీప్యాడ్, విగ్రహాల నిర్మాణ పనులు, బహిరంగ సభ స్థలం వద్ద ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెలీప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్ర త ఏర్పాట్లు చేయాలని, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అ నంతరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ జడ్పీ చైర్మన్ దివంగత ధ్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాల నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నందున పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. సభ ప్రాంగణంలో వేదిక, సీటింగ్ ఏర్పాట్లు చేసి బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.
పోలీసు శాఖ అధికారులు సభాప్రాంగణంలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లును చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వీఐపీ వాహనాల ప్రవేశ మార్గం, ప్ర జల రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.
తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు గ్రీన్ రూముల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. డిప్యూటీ ఇంజినీర్ ఇన్ఫర్మేషన్ అధికారి సౌండ్ సిస్టమ్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు సభాప్రాంగణంలో విద్యుత్ దీపాల ఏర్పా టు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి, సభకు హాజరయ్యే ప్రజలను నిర్ణీత సమయానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, రోడ్లు భావనల శాఖ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ శాఖ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎటువంటి సమస్యలకు తావు ఇవ్వ కుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైని సాయిశివాని, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఇలా..
నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధుల్లో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉరుకొండ పేటకు చేరుకొని, అక్కడ పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మిడ్జిల్ మండల పరిధిలో డాక్టర బీఆర్ అంబేద్కర్, దివంగత ధ్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మిడ్జిల్ మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.






