30 July, 2026 | 2:49 AM

క్రీడల్లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ

30-07-2026 01:18 AM

కుమ్రం భీం అసిఫాబాద్, జులై29 (విజయక్రాంతి): హైదరాబాద్లోని డీఏవీ మిధానీ పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించిన డీఏవీ క్లస్టర్ లెవల్ స్పోరట్స్ మీట్ లో సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన డీఏవీ లక్ష్మీపత్ సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

పాఠశాల నుంచి మొత్తం 34 మంది విద్యార్థులు ఆరు క్రీడా విభాగాల్లో పాల్గొనగా, 12 స్వర్ణ, ఒక రజత, ఒక కాంస్య పతకాలు సాధించారు. 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 బాలికల హ్యాండ్బాల్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, కరాటే అండర్-14 లో 3034 కిలోల బరువు విభాగంలో కాంస్య పతకం, 3438 కిలోల బరువు విభాగంలో రజత పతకం సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.