పేదలకు భరోసాగా నిలవడమే బీఆర్‌ఆర్ ఫౌండేషన్ లక్ష్యం
30-07-2026 01:18 AM
ఇబ్రహీంపట్నం, జులై 29(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మద్దెల బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని బిఆర్‌ఆర్ ఫౌండేషన్ సభ్యులు పరామర్శించారు. బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్నం రాము ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి దశదినకర్మ నిమిత్తం బియ్యాన్ని అందించారు.
ఫౌండేషన్ చైర్మన్ రామ్రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటామని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సద్దాం, వెంకటేష్, షకీర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






