9 July, 2026 | 1:49 AM

దాదా వస్తున్నాడు!

09-07-2026 12:36 AM

లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కుతోంది. ‘దాదా-ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లవ్ ఫిలమ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మిస్తున్నారు. సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.

ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇం గ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావుతో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్‌లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తులుగా మిగిలాయి.