లోకం సంకెళ్లు తెంచేద్దాం.. తబాహీ
రాకింగ్ స్టార్ యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్న చి త్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథ అందించిన ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. మాన్‌స్ట్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించాయి.
ఆగస్టు 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతం ‘తబాహీ’ అఫీషియల్ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘లోకం సంకెళ్లు తెంచేద్దాం.. కాలం పరదాలు కాల్చేద్దాం.. మనకై మనమై జీవించుదాం తబాహీ..’ అంటూ సాగుతోందీ గీతం. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ పాటకు హిందీలో రాజ్‌శేఖర్, తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
విశాల్ మిశ్రా స్వరపరచి, ఆలపించారు. యశ్, కియారా తొలిసారి జంటగా కనిపిస్తున్న ఈ పాటలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మ్యూజిక్ వీడియో టాక్సిక్ ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేస్తూ, అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.






