28 April, 2026 | 6:08 PM

Breaking News

ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి   •   రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు   •   విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు   •   ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి   •   జొన్నల కొనుగోలు సెంటర్లను పెంచండి   •   తుమ్మల నివాసంలో పూర్వ మిత్రుల కలయిక   •   అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •  

రఘువంశీ మ్యాచ్ ఫీజులో కోత

28-04-2026 12:24 AM

ముంబై, ఏప్రిల్ 27: కోల్‌కతా నైట్‌రైడ ర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. లక్నో జట్టు ‘అబ్ స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కోసం అప్పీల్ చేసింది. 

దీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘు వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపం గా మైదానాన్ని వీడాడు. హెల్మెట్‌ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నట్టు ప్రకటించింది.