calender_icon.png 15 February, 2026 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ కేశవ ఆలయంలో భక్తుల సందడి

15-02-2026 12:30:23 PM

వాంకిడి (విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరాన ఉన్న మూడు గోపురాల శివకేశవ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేసి సక్రమ దర్శనానికి చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.