27 June, 2026 | 2:18 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అవగాహన కల్పించండి

27-06-2026 12:53 AM

మహబూబ్ నగర్ టౌన్ జూన్ 26: ఇంటింటి గణన ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఈ.ఆర్.ఓ.లు, ఏ.ఈ.ఆర్.ఓ లు, సూపర్వైజర్లతో వెబెక్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ బి.ఎల్.ఓ.లు  ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం లు అందించి ఓటర్ల వివరాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జె.ఎల్.బి హరిప్రియ, ఆర్.డి.ఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు.