సీఎం రేవంత్ రెడ్డికి సమస్యలతో స్వాగతం: ఏబీవీపీ
నల్లగొండ, జూన్ 26 (విజయక్రాంతి): రేపు నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లాలోని ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలే స్వాగతం పలుకుతాయని మహా త్మాగాంధీ యూనివర్సిటీ ఏబీవీపి అధ్యక్షుడు హనుమాన్ చారి అన్నారు.
యూనివర్సిటీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని గత రెండేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. యూనివర్సిటీలను తక్షణమే ప్రక్షాళన చేసి, తగిన బడ్జెట్ కేటాయించడంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సమస్యలతోనే స్వాగతం పలు కుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.






