27 June, 2026 | 3:33 AM

డ్రగ్స్‌పై సమాచారం ఇవ్వండి

27-06-2026 02:16 AM

5 వేల రూపాయల నజరానా

మహబూబాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): గంజాయి రహిత జిల్లాగా మహబూబాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, గంజాయి సమాచారం పోలీసులకు తెలియజేస్తే 5వేల రూపాయల నజరానా ఇస్తామని మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని మహబూబాబాద్ సబ్ జైల్లో నిర్వహించారు.

జైలర్ మల్లెల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఎస్పీ జైల్లోని ఖైదీలచే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు.ఈ కార్యక్రమంలో  సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది మహ్మద్ ఖళీళ్, లక్ష్మన్, మోటపోతుల వీరన్న, పోషిని జనార్దన్, రామాంజనేయులు, నర్సింహారావు తో పాటు ఖైదీలు పాల్గొన్నారు.