‘సర్‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
ఓటర్ జాబితా సవరణలో బి.ఆర్.ఎస్, బూత్ ఏజెంట్లు విధిగా పాల్గొనండి : జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్
వనపర్తి మండలం, జూన్ 26: సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా సవరణ చేపట్టాలని బి.ఆర్.ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లకు, నాయకులకు, కార్యకర్తలకు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి మండలంలోని వెంకటాపురం, చిన్నగుంటపల్లి, చిట్యాల గ్రామాలలో నాయకులతో కలసి పర్యటించారు.
ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ‘సర్‘ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు యజ్ఞంలా భావించి ప్రతి గడప తిరుగుతూ నమోదు,మార్పులు, చేర్పులు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గ్రామ బి.ఎల్.ఓ లతో ప్రభుత్వపరంగా చేపడుతున్న విధి విధానాల గూర్చి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కె.మాణిక్యం, భానుప్రకాష్ రావు, రవిప్రకాష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల.రాము, సర్పంచులు పృథ్వీనాథ్ రెడ్డి, శోభా కృష్ణయ్య, ఆంజనేయులు, భగవంతు, ధర్మశాస్త్ర చారి, విష్ణు గౌడ్, రాములు తదితరులు ఉన్నారు.






