2 September, 2026 | 2:07 AM

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా బానోత్ నరేష్ నాయక్

02-09-2026 | 12:32am

కోనరావుపేట, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ల భించడం పట్ల బానోత్ నరేష్ నాయక్ హ ర్షం వ్యక్తం చేశారు.ఈ బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగించినందుకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు (Vemulawada MLA Adi Srinivas) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అనే అంశాలను పర్యవేక్షిస్తూ,

వారి సమస్యలను సం బంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని నరేష్ నాయక్ తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభు త్వ పథకాల అమలులో పారదర్శకత తీసుకురావడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.తనకు అప్పగించిన బాధ్య తలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్ర జలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని బానోత్ నరేష్ నాయక్ కోరారు.