27 May, 2026 | 9:59 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ప్రమాదం జరిగిన బాధితులకు వెంటనే సీపీఆర్ చేయాలి

31-03-2026 12:00 AM

ఆరైవ్ - అలైవ్ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి

కామారెడ్డి, మార్చి 30 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే సిపిఆర్ చేయాలని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారి పక్కన గల గెలాక్సీ ఫంక్షన్ హాల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చైతన్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44వ జాతీయ రహదారి పక్కన గల దాబాలు, హోటల్స్, పంచర్ షాప్, ఆటో డ్రైవర్లకు కామారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఏమి చేయాలి, ప్రమాదం జరిగినప్పుడు ఉండేటటువంటి గోల్డెన్ అవర్ లో ఎం చేయాలి అనే విషయాలను వివరించారు,  సి.పి.ఆర్ ఎలా చేయాలి అనే అంశం పై మెడికల్ ఆఫీసర్స్, నేషనల్ హై వే అథారిటీ కి సంబంధించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారితో సి.పి.ఆర్ లైవ్ డెమో చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, రూరల్ సిఐ రామన్, భిక్నూర్ సి.ఐ సంపత్ కుమార్, దేవునిపల్లి రాజంపేట, దోమకొండ, మాచారెడ్డ్, రామారెడ్డి ఎస్.ఐలు పాల్గొన్నారు.