27 May, 2026 | 10:57 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ఇక్కడో లెక్క..!

31-03-2026 12:00 AM

అనుపురం ఓ ఉన్నతాధికారి బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయం 

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు 

కరీంనగర్: మార్చి 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవా డలో కానీ సిరిసిల్లలో ఉండాల్సిన నీటిపారుదల శాఖ కార్యాలయం ఇదే శాఖలోని ఓ ఉ న్నతాధికారి సమీప బంధువుల వేములవాడ అర్బన్ గ్రామంలో ఇళ్లలో అద్దె పై కొ నసాగుతుంది. ప్రభుత్వం రెండు నెలల క్రి తం నీటిపారుదల శాఖలో అద్దె ఇళ్లలో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎందుకంటే ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడుతుండడంతో అద్దె ఇళ్లను ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలకు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇప్పుడు నీటిపారుదల శాఖ చాలా ముఖ్యమైన శాఖ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయాలతో పాటు సబ్ డివిజన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంలో, వేములవాడలో కరీంనగర్ జిల్లాలో గంగాధర లో సబ్ డివిజన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 

సమీప బంధువుల ఇళ్లలో ప్రభుత్వ కార్యాలయం 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం ఆర్ అండ్ ఆర్ కాలనీ లో నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో పరిపాలన సౌలభ్యం కోసం కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మూడు నాలుగు మండలాలను కలిపి ఒక్కొక్క సబ్ డివిజన్ గా ప్రభుత్వం గుర్తించి డివిజన్ సబ్ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో సరిపడా ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో డివిజన్ సబ్ డివిజన్ల కార్యాలయాలు అద్దె ఇళ్లలో కొనసాగాయి. ఈ విధంగా ప్రభుత్వంపై నెల వందలకోట్ల రూపాయల అద్దె భారం పడడంతో ప్రభుత్వం రెండు నెలల క్రితం వెంటనే అద్దె ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వ కార్యాలయంలో షిప్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కానీ వేములవాడ అనుపురం ఆర్ అండ్ ఆర్ కాలనీలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఓ ఉన్నతాధికారి సమీప బంధువుల ఇళ్లలో యధావిధిగా కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వానికి అదనం భారం పడడంతో పాటు, ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. ఆ అధికారి గత ప్రభుత్వంలో తిరుగులేని అధికారిగా ఆ శాఖలో పేరు పొందారు. అందుకే ఆయన తన అధికార బలంతో తన సమీప బంధువు ఇంటిలో ప్రభుత్వ కార్యాలయం పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఆ తంతు ఎద విధిగా కొనసాగుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వంపై ఇంటి అద్దె భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉన్నది.