విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి
27-05-2026 04:29 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగలకు తగులుకొని ఐదు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని తాటికొండ లింగన్న పొలం వద్ద గండి అనే ప్రాంతం దగ్గర ఈ బర్రెలు చనిపోయి పడి ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కాగా ఇవి రాత్రి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ బర్రెలు ఎవరివో సమాచారం తెలియాల్సి ఉంది.






