27 May, 2026 | 5:23 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

27-05-2026 04:28 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఏర్పాట్లను ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా  పరిశీలించారు.ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినోద్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్, ఉపాధ్యక్షుడు తారిక్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,నాయకులు సాయి ,నిఖిల్, జాలింషా, అమాన్, షఫీ, తదితరులు పాల్గొన్నారు.