NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య
న్యూఢిల్లీ: NEET-UG 2026 పరీక్షా పత్రాల లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) దూకుడు పెంచింది. ఈ కేసలో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఒక వైద్యుడు, పూణేకు చెందిన ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అధ్యాపకుడితో సహా తాజాగా జరిగిన అరెస్టులతో, ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 13కి చేరింది. తాజాగా అరెస్టు అయిన నిందితులలో లాతూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ మనోజ్ షిరూరే, పుణేలోని డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA)లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న తేజస్ హర్షద్‌కుమార్ షా ఉన్నారు.
CBI తెలిపిన వివరాల ప్రకారం, ఒక కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు, నిందితుడైన పీవీ కులకర్ణి నుండి రసాయనశాస్త్ర (Chemistry) ప్రశ్నలను ఇప్పించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సీబీఐ వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ కేసులో (NEET paper leak case)CBI ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లోని 49 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి, పలు నేరారోపణలకు దారితీసే పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన NEET (UG) 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేయబడిన విషయం తెలిసిందే.






