27 May, 2026 | 5:42 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి

27-05-2026 04:31 PM

బోథ్,(విజయక్రాంతి): రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి చేరే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్  కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ నరేష్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం బోత్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించడం జరిగింది. ప్రభుత్వం మీపై నమ్మకంతో బాధ్యతలు కట్టబెట్టిందని అయితే రైతుల సమస్యల పైన ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడంతో పాటు పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు సూచించారు. అంతేగాక సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు అందించే విధంగా మీ వంతు పాత్ర పోషించాలని వారు నూతన చైర్మన్కు సూచించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు