పోలీస్ అధికారులను అభినందించిన సీపీ
11-06-2026 12:00 AM
ఖమ్మం టౌన్, జూన్ 10 (విజయక్రాంతి): వివిధ పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగున్నతి పొందిన 2000 బ్యాచ్ చెందిన ఎనిమిది మంది పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. పదోన్నతి పొందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఖమ్మం జిల్లాకు ఇద్దరు, మహబూబాబాద్ జిల్లా ఒక్కరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నలుగురు, ఇంటిలిజెన్స్ ఒక్కరు బదిలీపై వెళ్ళనున్నారు.






