28 June, 2026 | 1:32 AM

పిడుగుపాటుకు 22 ఆవులు మృతి

28-06-2026 12:25 AM

ములుగు (మహబూబాబాద్), జూన్ 27 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం అంకంపెల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు మంకిడి సమ్మయ్యకు చెందిన 22 ఆవులు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగు పాటుకు గురై మరణించాయి. శనివారం ఉదయం ఆవులు మృతి చెందిన విషయాన్ని బాధితుడు గుర్తించాడు.

పొలంలో కంచె ఏర్పాటు చేసి ఆవుల మందను అక్కడ ఉంచగా, వాటిపై పిడుగు పడటంతో మృత్యు వాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవులనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న సమ్మయ్య కుటుంబం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి 10లక్షల నష్టం పరిహారం చెల్లించాలని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.